
రహస్యంగా పెండ్యాల శ్రీకాంత్ విచారణ
విజయవాడ : కాల్మనీ-సెక్స్ రాకెట్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ను టాస్క్ఫోర్స్ పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ జరుపుతున్నారు. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో తలదాచుకున్న శ్రీకాంత్‌ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని మాచవరం పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. కాల్‌మనీ ముసుగులో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన ఓ బాధిత మహిళ ఫిర్యాదు మేరకు యలమంచిలి రాము, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు, విద్యుత్ డీఈ ఎం.సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేశ్‌లపై కేసు నమోదు అయిన తెలిసిందే.
కాగా పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజుకు పెండ్యాల శ్రీకాంత్ సన్నిహితుడు. కోడిపందాల నిర్వహణ, పందెంకోళ్ల తయారీలో ఇతడు నిపుణుడు. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో శ్రీకాంత్కు చెందిన మామిడి తోటపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందెంకోళ్ల బెట్టింగ్లోనూ శ్రీకాంత్ సూత్రధారిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే అతడిని టీడీపీ నేతలు అండగా ఉండటంతో ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.