pendyala srikanth
-
కాల్‌మనీ ఆర్థిక మూలాలపై టాస్క్‌ఫోర్స్ ఆరా
విజయవాడ : కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్‌మనీ ముఠా ఆర్థిక మూలాలపై టాస్క్‌ఫోర్స్ ఆరా తీస్తోంది. టీడీపీ నేతలు, ఎన్ఆర్ఐల పెట్టుబడులు ఉన్నట్లు సమాచారంతో ఆ దిశగా విచారణ కొనసాగుతోంది. కొందరు ప్రవాస భారతీయులతోపాటు ఇక్కడ ఆర్థికంగా స్థితిమంతులైన ఎన్జీవో నేతలు కాల్‌మనీ సెక్స్ రాకెట్ ముఠా తరఫున పెట్టుబడులు పెట్టిన వ్యవహారం విచారణలో వెలుగులోకి వస్తోంది. విచారణలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం సహా పలుచోట్ల కాల్ మనీ-సెక్స్ రాకెట్ ముఠా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు విచారణలో గుర్తించారు. మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు చెన్నుపాటి శ్రీనివాసరావు, వెనిగళ్ల శ్రీకాంత్ కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వారి సన్నిహితులు, బంధువుల ద్వారా నిందితులపై ఒత్తిడి తెస్తున్నారు. గత్యంతరం లేక నిందితులు లొంగుబాటు యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ప్రముఖల ద్వారా వారు లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
రహస్యంగా పెండ్యాల శ్రీకాంత్ విచారణ
విజయవాడ : కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ జరుపుతున్నారు. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో తలదాచుకున్న శ్రీకాంత్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని మాచవరం పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. కాల్‌మనీ ముసుగులో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన ఓ బాధిత మహిళ ఫిర్యాదు మేరకు యలమంచిలి రాము, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు, విద్యుత్ డీఈ ఎం.సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేశ్‌లపై కేసు నమోదు అయిన తెలిసిందే. కాగా పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజుకు పెండ్యాల శ్రీకాంత్ సన్నిహితుడు. కోడిపందాల నిర్వహణ, పందెంకోళ్ల తయారీలో ఇతడు నిపుణుడు. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో శ్రీకాంత్‌కు చెందిన మామిడి తోటపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందెంకోళ్ల బెట్టింగ్లోనూ శ్రీకాంత్ సూత్రధారిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే అతడిని టీడీపీ నేతలు అండగా ఉండటంతో ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కాల్‌మనీ నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ అరెస్ట్
-
'స్నేహితుడే కానీ.. అతనితో సంబంధం లేదు'
-
'స్నేహితుడే కానీ.. అతనితో సంబంధం లేదు'
ఏలూరు (మెట్రో): విజయవాడ కాల్‌మనీ కేసులో ఏ-6 నిందితునిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ తన మిత్రుడేనని పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు స్పష్టం చేశారు. ఏలూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..కాల్‌మనీ సిండికేట్‌లో తాను రూ.కోటి పెట్టుబడి పెట్టినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఆ కేసులో ఏ-6గా ఉన్న శ్రీకాంత్ తనకు స్నేహితుడే కానీ ఇటీవల కాలంలో అతనితో ఆర్థిక సంబంధాలు నెరపలేదని చెప్పారు. మూడు రోజుల క్రితం వరకు శ్రీకాంత్ వాడిన ఇన్నోవా వాహనం తనదేనని బాపిరాజు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ కారు విక్రయించాలని రాజమండ్రిలో ఉన్న స్నేహితునికి ఇస్తే అతను విజయవాడలో ఉన్న శ్రీకాంత్‌కు ఇచ్చాడని, ఈ విషయం తనకు మూడు రోజుల కిందటే తెలిసిందని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఆ కేసులో నిందితునిగా ఉన్నాడని తెలియడంతో వెంటనే ఆ కారును తెచ్చుకున్నానని చెప్పారు. శ్రీకాంత్ మంగళవారం ఉదయం వరకూ నల్లజర్లలోని మీ ఇంటికి సమీపంలోనే ఆశ్రయం పొందారన్న వాదనలు వినిపిస్తున్నాయిగా అని ఓ విలేకరి ప్రస్తావించగా, ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సరైన సమాధానం చెప్పకుండానే మీరు నిరూపిస్తారా అంటూ ఎదురు ప్రశ్నించారు.