'స్నేహితుడే కానీ.. అతనితో సంబంధం లేదు' | he is my friend but i dont have relation: bapiraju | Sakshi
Sakshi News home page

'స్నేహితుడే కానీ.. అతనితో సంబంధం లేదు'

Published Tue, Dec 15 2015 9:41 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

he is my friend but i dont have relation: bapiraju

ఏలూరు (మెట్రో): విజయవాడ కాల్‌మనీ కేసులో ఏ-6 నిందితునిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ తన మిత్రుడేనని పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు స్పష్టం చేశారు. ఏలూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..కాల్‌మనీ సిండికేట్‌లో తాను రూ.కోటి పెట్టుబడి పెట్టినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఆ కేసులో ఏ-6గా ఉన్న శ్రీకాంత్ తనకు స్నేహితుడే కానీ ఇటీవల కాలంలో అతనితో ఆర్థిక సంబంధాలు నెరపలేదని చెప్పారు. మూడు రోజుల క్రితం వరకు శ్రీకాంత్ వాడిన ఇన్నోవా వాహనం తనదేనని బాపిరాజు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆ కారు విక్రయించాలని రాజమండ్రిలో ఉన్న స్నేహితునికి ఇస్తే అతను విజయవాడలో ఉన్న శ్రీకాంత్‌కు ఇచ్చాడని, ఈ విషయం తనకు మూడు రోజుల కిందటే తెలిసిందని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఆ కేసులో నిందితునిగా ఉన్నాడని తెలియడంతో వెంటనే ఆ కారును తెచ్చుకున్నానని చెప్పారు. శ్రీకాంత్ మంగళవారం ఉదయం వరకూ నల్లజర్లలోని మీ ఇంటికి సమీపంలోనే ఆశ్రయం పొందారన్న వాదనలు వినిపిస్తున్నాయిగా అని ఓ విలేకరి ప్రస్తావించగా, ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సరైన సమాధానం చెప్పకుండానే మీరు నిరూపిస్తారా అంటూ ఎదురు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement