వైఎస్సార్‌సీపీ నేత, తాడేపల్లి నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమ గోదావరి : వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నేతల జులుం పెచ్చు మీరుతోంది. నందమూరు వరద బాధితులకు అండగా నిలిచినందుకు తాడేపల్లిగూడెం వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణతో పాటు కొంతమంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఈ ఆదివారం పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం నందమూరు గ్రామంలో వరద బాధితులకు అన్యాయంపై ఆయన అధికారులని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. అదే సమయానికి నందమూరుకు వచ్చిన కలెక్టర్ కాటమనేనికి జరిగిన విషయంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
దీంతో కొట్టుపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కొట్టు సత్యనారాయణతో పాటు మరో ముగ్గురిపై 341,323 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. కాగా వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాలంటూ జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు వర్గం ఒత్తిడి తెచ్చింది. ఎర్రకాలువ పనులలో జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు వర్గం అవినీతికి పాల్పడ్డారంటూ కొట్టు సత్యనారాయణ కొన్ని రోజుల క్రితం ఆరోపించారు. కొట్టుపై తప్పుడు కేసులు పెట్టడానికి కలెక్టర్‌తో పాటు జెడ్పీ ఛైర్మన్ ఒత్తిడి తెచ్చారంటూ వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment