
భారీగా బాహుబలి పైరసీ సీడీలు సీజ్
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీతో దూసుకుపోతున్న బాహుబలి-2 చిత్రానికి పైరసీ బారినపడింది. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈ చిత్రం పైరసీ సీడీలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా విజయవాడలోని బీసెంట్ రోడ్, గవర్నర్ పేటల్లోని పలు సీడీ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో భారీగా బాహుబలి-2 సినిమా ఫైరసీ సీడీలు పట్టుబడ్డాయి. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులతో సీడీ షాపుల యజమానులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఒకవైపు దాడులు జరుగుతుండగా, మరోవైపు షాపులు మూసివేసి సీడీ షాపుల షాపుల యాజమానులు పరారయ్యారు. కాగా విశాఖపట్నంలోనూ 100 పైరసీ సీడీలను అధికారులు నిన్న సీజ్ చేశారు.