విజయవాడ: హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఏలేశ్వరపు జగన్మోహన్రాజును పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. దేవాలయాల కూల్చివేత సమయంలో పనులను జగన్మోహన్రాజు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ క్రమంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ... హిందూ దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు.