
క్రైమ్: పొరుగింట్లో ఉంటోంది.. కాస్త చనువు ప్రదర్శిద్దామనుకున్నాడో ఏమో.. వచ్చి బండెక్కు అన్నాడు!. అయితే.. ఆమె ప్రతికూలంగా స్పందించింది. అవమానంగా అనిపించింది కాబోలు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. నడిరోడ్డు మీదే ఆమెపై దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రి పాలుకాగా, పరారీలో ఉన్నాడు నిందితుడు.
హర్యానా గురుగ్రామ్‌లో ఓ మహిళపై వ్యక్తి దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వీడియో వైరల్ కావడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రేస్ చేసి నిందితుడ్ని కమల్ అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ మనోజ్ మీడియాకు వెల్లడించారు.
బాధితురాలు కమల్ పక్క ఇంట్లోనే ఉంటోందని విచారణలో తేలింది. ఆటోలో ఆమె కూర్చుని ఉండగా.. బైక్ మీద వచ్చిన కమల్ ఆమెతో మాట్లాడాడు. వచ్చి తన బైక్ ఎక్కాలని ఆమెను కోరాడు. అయితే ఆమె అంగీకరించకపోవడంతో.. కోపంతో ఊగిపోతూ ఆమెపై దాడికి దిగాడు. చేతిలో ఉన్న హెల్మెట్‌తో బాదేశాడు. స్థానికులు కొందరు గుమిగూడి.. కమల్‌ను నెట్టేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ మనోజ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment