కోరుట్ల: సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ తయారీ కోసం రైటర్లను ఆశ్రయించడం సాధారణంగా మారింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో అవగాహన లేనికొంత మంది డాక్యుమెంట్ రైటర్లు.. నివాసం లేదా ఖాళీస్థలం క్రయ, విక్రయాల డాక్యుమెంట్ తయారు చేసే సమయంలో తప్పలతడకగా వివరాలు నమోదు చేయడం.. అదే నమూనాతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్ర క్రియ పూర్తిచేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లకు ఓ సె క్షన్, ఖాళీస్థలాల రిజిస్ట్రేషన్లకు మరో సెక్షన్ ఉంటుంది. ఖాళీ స్థలాలకు వీఎల్‌టీ నంబరుతో రిజి స్ట్రేషన్లు చేయాల్సి ఉండగా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇంటిస్థలాల నంబర్లతో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడే సమస్య తలెత్తుతోంది.
ఈ రెండు పద్ధతుల్లో పొరపాట్లు చోటుచేసుకోవడంతో యజమానులకు తెలియకుండానే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లకుండానే ఒకరి ఆస్తులు మరొకరి పేరిట నమోదు కావడం గందరగోళానికి దారితీసోంది. వెలుగులోకిరాని ఇలాంటి తప్పిదాలు అనేకం జరిగినా అధికారులు స్పందించడంలేదు.
దిద్దుబాటు పరేషాన్..
● పొరపాటుగా ఆస్తులకు చెందిన వీఎల్‌టీ లేదా ఇంటి నంబర్లు మారి రిజిస్ట్రేషన్లు జరగడంతో ఆ వివరాలు ఆటో మ్యుటేషన్ ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్‌లో మున్సిపల్ కార్యాలయానికి చేరుతున్నాయి.
● ఆ వివరాల ప్రకారం.. మున్సిపల్ అధికారులు పేరు మార్పిడి చేసి ఆస్తి పన్ను లేదా ఖాళీ స్థలాల పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది.
● మున్సిపల్ అధికారులు పన్నుల వసూలుకు వెళ్తున్న సందర్భంలో లేదా ఆస్తి హక్కుదారులు పన్ను చెల్లించే సందర్భంగా జరిగిన పొరపాట్లు వెలుగులోకి వస్తున్నాయి.
● ఈ పొరపాటును సరిదిద్దే అంశం తమ పరిధిలో లేదని మున్సిపల్ అధికారులు తేల్చి చెపుతుండగా.. మున్సిపాల్టీలో సరిదిద్దే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని..తాము సమస్యను జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్తే కాలాయాపన జరుగుతుందని సబ్ రిజిస్ట్రార్ అధికారులు అంటున్నారు.
● మొత్తం మీద పొరపాట్లు అధికారులు చేస్తే ఆస్తి హక్కుదారులు మాత్రం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్నారు.
● ఉన్నతాధికారులు తగిన రీతిలో స్పందించి అవసరమైన చర్యలు తీసుకుని పొరపాట్లును సరిదిద్దాలని బాధితులు కోరుతున్నారు.
ఇతడి పేరు తోట గంగారాం. ఆస్తిపన్ను చెల్లించేందుకు వారంక్రితం కోరుట్ల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. ఇంటి నంబరు చెప్పగానే గంగారాం పేరిట ఇల్లే లేదని అధికారులు తేల్చేశారు. వేరేవాళ్ల పేరు ఎలా వచ్చిందని బిత్తరపోయిన గంగారాం.. ఇదేమిటని ప్రశ్నిస్తే.. రిష్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అడుగు అని ఉచిత సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్లి ఆరా తీస్తే.. తన ప్రమే యం లేకుండానే ఇతరులు చేసుకున్న రిజిస్ట్రేషన్‌లో తనఇంటి నంబరు నమో దు చేసి.. ఆ వివరాలను ఆన్‌లైన్ ద్వారా బల్దియా కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. దానిప్రకారం ఏడాది క్రితమే ఆటో మ్యుటేషన్‌తో తన ఇల్లు వేరేవారి పేరిట నమోదైనట్లు స్పష్టమైంది.
కోరుట్ల మెయిన్‌డ్డుడ్‌లోని ఓ దుకాణా యజమాని.. తన ఇంటి సమీపంలోని ఖాళీస్థలాన్ని వీఎల్‌టీ నంబరుతో తన బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. వారంక్రితం అతడు ఆస్తిపన్ను చెల్లించడానికి బల్దియా కార్యాలయానికి వెళ్తే.. ఖాళీ స్థలమే కాకుండా తన బంధువుల పేరిట నమోదు అయిందని తెలిసి నివ్వెరపోయాడు.
జిల్లా రిజిస్ట్రార్‌కు నివేదిస్తాం
వీఎల్‌టీ, ఇంటి నంబర్ల నమోదులో పొరపాట్లు జరగడంతో తప్పులు చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నాం. వీటిని సరిదిద్దడానికి జిల్లా రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున ఆస్తుల వివరాలు మారిన వారు మాకు దరఖాస్తు చేసుకోవాలి. కొంత కాలయాపన జరిగినా ఆటో మ్యుటేషన్‌లో జరిగిన పొరపాట్లు సరిచేస్తాం.
– శ్రీధర్‌రాజు, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్, కోరుట్ల
Comments
Please login to add a commentAdd a comment