పోటీతత్వం పెంచుకోవాలి
జగిత్యాల: విద్యార్థులు పోటీతత్వం పెంచుకోవాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్వీప్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలో రంగవల్లులు, వ్యాసరచన, వ్యక్తి త్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన లత మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పో టీతత్వం ఉంటేనే ఉన్నతస్థాయికి వెళ్లవచ్చన్నా రు. వ్యాసరచనలో మెడిసిన్ ఫస్టియర్ విద్యార్థిని జాహ్నవి ప్రథమ, నర్సింగ్ ఫస్టియర్ వి ద్యార్థిని రజిత ద్వితీయ, ముగ్గుల పోటీల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని హిరణ్మయి ప్రథ మ, మెడిసిన్ విద్యార్థిని సాయిలక్ష్మీ ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి లత బహుమతులు అందించారు. కార్యక్రమంలో స్వీప్ జిల్లా నోడ ల్ అధికారి దేవేందర్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఎండీ.అఖిల్, ఏడీఎం మమత, మెడికల్ కళా శాల ప్రిన్సిపాల్ శిల్ప, నర్సింగ్ కళాశాల ప్రి న్సి పాల్ లిల్లిమేరీ, అధ్యాపకబృందం పాల్గొన్నారు.
సకలమ్మ మృతితో పదిరలో విషాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మాజీ సీఎం కేసీఆర్ సోదరి చీటీ సకలమ్మ(82) మృతితో ఆమె స్వగ్రామం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో విషాదం అలుముకుంది. సకలమ్మతో ఉన్న అనుబంధాన్ని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తన చిన్నతనంలో పదిరలో సోదరితో కలిసే ఉండేవారని స్థానికులు చర్చించుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న సకలమ్మ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. ఆమెకు చీటీ నర్సింగరావు, చీటీ ఉమేశ్‌రావు, చీటీ రవీందర్‌రావు కుమారులు. శనివారం హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. మండలం నుంచి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, నాయకులు అందే సుభాష్, కొండ రమేశ్‌గౌడ్, గుల్లపల్లి నర్సింహారెడ్డి, కుంబాల మల్లారెడ్డి, నమిలికొండ శ్రీనివాస్, నర్సింలు, పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment