వైజ్ఞానిక ప్రదర్శనలో జగిత్యాల విద్యార్థుల ప్రతిభ
జగిత్యాల/రాయికల్: దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చారు. అలాగే రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఉపాధ్యాయుడు అభయ్‌రాజ్ కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జిల్లాకేంద్రంలోని మౌంట్ కా ర్మెల్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి మణిదీప్ ప్రదర్శించిన బార్డర్డ్ అలారం ద్వితీయ బహుమతి, వ్యక్తిగత విభాగంలో తెలంగాణ ట్రోఫీ సాధించారు. మె ట్‌పల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పరిషత్‌కు చెందిన విద్యార్థులు వర్షిత, వాగ్దేవి రూపొందించిన మల్టీపర్పస్ క్రాప్ ప్రొటెక్టర్ ప్రాజెక్ట్ ప్రత్యేక బహుమతి సాధించింది. కుమ్మరిపల్లి హెచ్‌ఎం కడకుంట్ల అభయ్‌రాజ్ రూపొందించిన సూపర్ సైన్స్ కిట్‌కు ప్రత్యేక బహుమతి సాధించింది. పుదుచ్చేరి స్పీకర్ సెల్వం, విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం, మ్యూ జియం డైరెక్టర్ విశ్వేశ్వరయ్య చేతుల మీదుగా వీరు బహుమతులు అందుకున్నారు. డీఈవో రాము, జి ల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ వీరిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment