● ఇద్దరికి గాయాలు ● ఆస్పత్రికి తరలింపు
మల్యాల(చొప్పదండి): కుటుంబ కలహాల నేపథ్యంలో బామ్మర్దులపై దాడి చేశాడో బావ. ఈ ఘటన మండలంలోని ముత్యంపేటలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండోజు చంద్రశేఖర్‌కు జగిత్యాల చెందిన అనసూరి నవ్యతో 2021లో వివాహమైంది. కుటుంబ కలహాలతో ఏడాదిగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. జిల్లాకేంద్రంలో చంద్రశేఖర్‌పై వరకట్నం కేసు నమోదైంది. పెద్దమనుషుల సమక్షంలో రెండుసార్లు పంచాయితీ నిర్వహించారు. ఈనెల 26న మరోసారి పంచాయితీ ఉంది. ఈ క్రమంలో చంద్రశేఖర్‌తో మాట్లాడేందుకు నవ్య తండ్రి, అన్నదమ్ములు నవీన్‌కుమార్, శివసాయి ఆయన ఇంటికి వెళ్లారు. మాటామాటా పెరిగి శివసాయి, నవీన్‌కుమార్‌పై చంద్రశేఖర్ కత్తితో దాడి చేసి, గాయపర్చాడు. బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి.. అక్కడినుంచి 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తిపై కేసు
సారంగాపూర్: బీర్‌పూర్ మండలం మంగేళ క్రాస్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి గంజాయి తరలించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన పరచ సురేష్ ఓ బ్యాగులో గంజాయిని తరలించడానికి క్రాస్ రోడ్డు వద్ద నిరీక్షిస్తున్నాడు. అదే సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. సురేశ్ అనుమానంగా కనిపించడంతో తనిఖీ చేయగా బ్యాగులో 500 గ్రాముల గంజాయి కనిపించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని సురేశ్‌పై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
దాడిచేసిన వ్యక్తులపై కేసు
జగిత్యాలక్రైం: గొల్లపల్లి రోడ్‌లోని ఓ బార్‌లో కస్తూరి శోభన్‌బాబుపై దాడిచేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్ తెలిపారు. పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామానికి చెందిన శోభన్‌బాబు అదే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈనెల 22న గొల్లపల్లి రోడ్‌లోని ఓ బార్‌లో మద్యం తాగేందుకు వెళ్లారు. పక్కనే మద్యం తాగుతూ కూర్చున్న బండి శ్రీకాంత్, కుసుంబ నిఖిల్, దీక్షిత్ శోభన్‌బాబుపై దాడిచేశారు. బీరుసీసాతో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment