
చెన్నై : అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న జొమాటో సంస్థకు చెందిన బ్యాగులను గుర్తించి రూ. లక్ష జరిమానాను చెన్నై కార్పొరేషన్ అధికారులు విధించారు. చెన్నైలో డెంగీ నివారణ చర్యలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయో తనిఖీలు చేసి, ఆయా సంస్థలు, కార్యాలయాలకు కార్పొరేషన్ అధికారులు జరిమానా విధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై చేట్‌పెట్ ఎంసీ నికల్సన్ రోడ్డు ఓ భవనంలో ప్రముఖ ఆన్‌లైన్ ఆహార సంస్థగా ఉన్నజొమాటోకు చెందిన బ్యాగులు అపరిశుభ్రంగా ఉండడం గుర్తించి రూ.లక్ష జరిమానా విధించారు.