సాక్షి, చెన్నై: ఆహార సరఫరా రంగంలో ప్రముఖంగా ఉన్న జుమోటోపై చెన్నై ట్రాఫిక్ పోలీసులు కన్నెర్ర చేశారు. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల్లో ఎలా వినియోగదారులకు ఆహారం డెలివరీ చేస్తారో తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ సంస్థకు గురువారం నోటీసులు జారీ చేశారు. వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చే ఆహార పదార్థాలను జుమోటో ప్రతినిధులు ఇళ్లు, కార్యాలయాలు అంటూ ఎక్కడికైనా సరే తీసుకెళ్లి అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వినియోగదారుడికి మరింత చేరువయ్యే విధంగా ఆర్డర్‌ఇచ్చిన 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రకటనను జుమోటో వర్గాలు తాజాగా చేశాయి.
చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ప్రపంచంలోనే మొదటి కంపెనీగా..!
దీంతో కేవలం పది నిమిషాల్లో ఎలా డెలివరీ చేస్తారో..? అనే చర్చ బయలుదేరింది. చెన్నై వంటి నగరాల్లో అయితే, ఇది అసాధ్యమన్న సంకేతాలు కూడా వినిపించాయి. పది నిమిషాల్లో వినియోగ దారుడికి ఆహార పదార్థాలు అందించాల్సి ఉండటంతో, ఆ ప్రతినిధులు తమ వాహనాల్లో అతివేగంగా దూసుకెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమించక తప్పదు. దీనిని పరిగణించిన చెన్నై ట్రాఫిక్ పోలీసు వర్గాలు జుమోటోకు నోటీసులు జారీ చేశాయి. పది నిమిషాల్లో ఎలా ఫుడ్ సరఫరా చేస్తారో అనే విషయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు. చదవండి: జొమాటోపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..! సాధ్యమంటోన్న కంపెనీ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment