లక్నో: అలీఘర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు 1000 చలాన్లు జారీ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ గురించి అవగాహన కల్పించడానికి పోలీసులు నిర్వహించిన ప్రచారంలో భాగంగా ముఖానికి మాస్కులు ధరించని డ్రైవర్లపై రూ.100 చొప్పున జారీమానా విధించారు. జిల్లాలోని ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరిస్తున్నారా అని తెలుసుకునేందుకు నగరమంతా పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీసర్ అనిల్ మాట్లాడుతూ, ‘కరోనా ప్రోటోకాల్ గురించి అవగాహన కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి కారులో ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించకూడదు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరిస్తున్నారా లేదా అని తనిఖీ చేస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 1,000 చలాన్లు జారీ చేశాం’ అని తెలిపారు. ఇప్పటి వరకు ఉత్తర ప్రదేశ్‌లో 55,538 యాక్టివ్ కరోనావైరస్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,76,677 మంది రికవరీ కాగా 3,542 మంది మరణించారు.
చదవండి: భారత్‌లో ఒక్కరోజే 83వేల కేసులు
Comments
Please login to add a commentAdd a comment