కృత్రిమ మేధను ప్రపంచాన్నే మెచ్చుకుంటున్న వేళ దిగ్బ్రాంతి కలిగించే సంఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. ఇది విన్న ప్రజలు ఒక్కసారిగా నివ్వెరపోతున్నారు. ఇంతకీ అంతలా ఆశ్చర్యపరిచిన సంఘటన ఏంటి? దాని వెనుకున్న అసలు నిజాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గత కొన్ని రోజులకు ముందు కేరళ ప్రభుత్వం ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 726 ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కెమెరాలను అమర్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధిన చాలా విషయాలు స్వయంచాలకంగా రికార్డవుతాయి, రూల్స్ అతిక్రమించిన వారికి చలానాలు జారీ చేస్తాయి. (స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్‌వర్త్ ఎంతంటే?)
ఇటీవల AI కెమెరా ఒక బైకర్ గంటకు 1240 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించి వారికి చలాన్ కూడా జరీ చేసింది. బైక్ ఏంటి? గంటకు 1240కిమీ వేగం ఏంటి అని చాలామందికి సందేహం రావొచ్చు.. ఇక్కడమే మనకు అర్థమైపోతుంది ఇది 'ఏఐ' లోపమే అని. దీనిపైన స్పందించిన సంబంధిత అధికారులు ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా అడ్డుకుంటామని, దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు.
(ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో)
ఈ ఘటనకు సంబంధించిన వీడియో జైహింద్ టీవీ తమ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. ఇందులో ఏఐ కెమెరా మోటార్ సైకిల్ వేగాన్ని తప్పుగా గుర్తించినట్లు పేర్కొంది. కెమెరా ఫోటో తీసి కంట్రోల్ రూమ్‌కి పంపిందని ఆ తరువాత ఓవర్ స్పీడ్ 1240 కిమీ అని చలాన్ జారీ చేసింది. కానీ ఇది హెల్మెట్ ధరించకపోవడం వల్ల వేసిన జరిమానా అని అధికారులు మొదట్లో పేర్కొన్నారు, ఆ తరువాత బైకర్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఎటువంటి జరిమానా విధించలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment