
గోల్కొండ: అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన గోల్కొండ పోలీసులకు బల్దియా అధికారులు జరిమానా విధించారు. గురువారం గోల్కొండ కోట బోనాల సందర్భంగా గోల్కొండ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అమ్మవారి చిత్రంతో పాటు డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని కోట వద్ద ఏర్పాటు చేశారు. ఈ విషయం బల్దియా అధికారులకు తెలియడంతో వెంటనే డిప్యూటీ కమిషనర్ పబ్లిక్ స్థలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు గోల్కొండ ఎస్‌హెచ్‌ఓకు రూ.10 వేల జరిమానా విధించారు.