
రాజేంద్రనగర్: పాచిపోయిన పులిహోరను వినియోగదారులకు అందించిన ఓ హోటల్‌కు రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ. 51 వేల జరిమానాను విధించారు. బండ్లగూడలోని శ్రీకృష్ణ ఉడిపి హోటల్ నిర్వహకులు శుక్రవారం పాడైపోయిన పులిహోరాను వినియోగదారులకు అందించారు. ఈ విషయమై వినియోగదారులు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ రమేశ్‌కు ఫిర్యాదు చేయడంతో హోటల్ తనిఖీలు నిర్వహించారు. పాచిపోయిన పులిహోరాతో పాటు ఇతర పదార్థాలను గుర్తించిన అధికారులు హోటల్ నిర్వహకుడికి రూ. 51 వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే హోటల్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించామ న్నారు. మున్సిపల్ సిబ్బంది మధ్యాహ్న భోజనం కోసం ఉడిపి హోటల్‌కు రావడంతో విషయం వెలుగుచూసిందని తెలిపారు.
తనిఖీ చేస్తున్న కార్పొరేషన్ అధికారులు