ఎక్కడి ఆటో.. అక్కడే! | Autos bandh success in Hyderabad over 108 GO | Sakshi
Sakshi News home page

ఎక్కడి ఆటో.. అక్కడే!

Published Thu, Sep 5 2013 4:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

చలానాలను పెంచుతూ జారీ చేసిన జీవో 108ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఆటో వాలాలు బుధవారం బంద్ పాటించారు.

సాక్షి, హైదరాబాద్: చలానాలను పెంచుతూ జారీ చేసిన జీవో 108ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఆటో వాలాలు బుధవారం బంద్ పాటించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 100 ఉన్న ట్రాఫిక్ చలానాను ఒక్కసారిగా రూ. 1000కి పెంచడాన్ని నిరసిస్తున్న ఆటో సంఘాల జేఏసీ బంద్‌కు పిలుపు నిచ్చింది. దీంతో ఆటోలు ఎక్కడివక్కడే నిలిచిపోగా, రోడ్లపైకి వచ్చిన కొన్ని ఆటోలను జేఏసీ నేతలు బలవంతంగా నిలిపివేయించారు. హబ్సిగూడలో కొందరు ఆటోడ్రైవర్లు మెట్రో కోసం ఏర్పాటు చేసిన పైపుల పెకైక్కి హల్‌చల్ సృష్టించారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్ల వద్ద ఆటోలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బం దులకు గురయ్యారు. బస్సులు కిక్కిరిసిపోయి కన్పించాయి. బంద్ మరింత ఉధృతం చేస్తామని ఆటో సంఘాల జేఏసీ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement