Autos bandh
-
జనవరి 8న ఆటో బంద్
హైదరాబాద్ : ఫైనాన్షియర్ల వేధింపులను ఆరికట్టడానికి ప్రభుత్వం అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని జనవరి 8న ఒక్క రోజు ఆటోబంద్‌ను తెలంగాణ ఆటో డ్రైవర్ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరులతో ఆ సంఘాల నేతలు మహ్మద్ అమానుల్లాఖాన్(టీఏడీజేఏసీ), బి. వెంకటేశం(ఏఐటీయుసీ)లు మాట్లాడారు. పద్మప్రియా ఆటో ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆటో డ్రైవర్ ఎస్కే.జానీ మృతి చెందాడని, ఆ ఫైనా న్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని వారు కోరారు. ఈ ఫైనాన్స్ సంఘాలు పార్టీలకు పార్టీ నిధి ఇస్తుండటంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఫైనాన్సర్ల వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు వీరిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో ఎంఎ. సలీం. రఫతుల్లాబేగ్, సత్తిరెడ్డి, కిరణ్, మల్లేశ్‌గౌడ్, అజయ్‌బాబు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్ల బహిరంగ సభను విజయవంతం చేయాలి
టాడు గౌరవ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ పోచమ్మమైదాన్ : ఆగస్టు 1వ తేదీన ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవం సందర్భంగా టాడు ఆధ్వర్యంలో నిర్వహించే ఆటోడ్రైవర్ల బహిరంగ సభను విజయవంతం చేయాలని సంఘం గౌరవ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ పిలుపునిచ్చారు. వరంగల్ రంగంపేటలోని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (టాడు) కేంద్ర కార్యాలయంలో బహిరంగ సభ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఆగస్టు 1న అలంకార్ జంక్షన్ నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ఆటో డ్రైవర్స్‌తో భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం ఏనుగుల గడ్డలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా ఆటోల బంద్ పాటించాలన్నారు. కార్యక్రమంలో టాడు గ్రేటర్ అధ్యక్షుడు యాకుబ్, ప్రధాన కార్యదర్శి జిలుకర స్వామి, నాయకులు వరికెల కిషన్, ఇసంపెల్లి సంజీవ, మేకల రవీందర్, కలకోట్ల జయరాం, దారా సూరి, మడికొండ బాబు, పసునూరి బాబు, చీకటి కుమార్, హరిచంద్రనాయక్, జన్ను బాబు, శంకర్, శ్రీనివాస్, శ్యాం, నర్సయ్య, బాల్ రాజ్, కాంతయ్య పాల్గొన్నారు. -
చిత్తూరుజిల్లాలో 72 గంటల ఆటోల బంద్
-
ఎక్కడి ఆటో.. అక్కడే!
సాక్షి, హైదరాబాద్: చలానాలను పెంచుతూ జారీ చేసిన జీవో 108ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఆటో వాలాలు బుధవారం బంద్ పాటించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 100 ఉన్న ట్రాఫిక్ చలానాను ఒక్కసారిగా రూ. 1000కి పెంచడాన్ని నిరసిస్తున్న ఆటో సంఘాల జేఏసీ బంద్‌కు పిలుపు నిచ్చింది. దీంతో ఆటోలు ఎక్కడివక్కడే నిలిచిపోగా, రోడ్లపైకి వచ్చిన కొన్ని ఆటోలను జేఏసీ నేతలు బలవంతంగా నిలిపివేయించారు. హబ్సిగూడలో కొందరు ఆటోడ్రైవర్లు మెట్రో కోసం ఏర్పాటు చేసిన పైపుల పెకైక్కి హల్చల్ సృష్టించారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్ల వద్ద ఆటోలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బం దులకు గురయ్యారు. బస్సులు కిక్కిరిసిపోయి కన్పించాయి. బంద్ మరింత ఉధృతం చేస్తామని ఆటో సంఘాల జేఏసీ ప్రకటించింది.