ఆటో డ్రైవర్ల బహిరంగ సభను విజయవంతం చేయాలి | successes the an open meeting of auto drivers | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ల బహిరంగ సభను విజయవంతం చేయాలి

Published Sun, Jul 24 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

successes the an open meeting of auto drivers

టాడు గౌరవ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్‌
పోచమ్మమైదాన్‌ : ఆగస్టు 1వ తేదీన ప్రపంచ ఆటో డ్రైవర్స్‌ దినోత్సవం సందర్భంగా టాడు ఆధ్వర్యంలో నిర్వహించే ఆటోడ్రైవర్ల బహిరంగ సభను విజయవంతం చేయాలని సంఘం గౌరవ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్‌ పిలుపునిచ్చారు. వరంగల్‌ రంగంపేటలోని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ (టాడు) కేంద్ర కార్యాలయంలో బహిరంగ సభ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ ఆగస్టు 1న అలంకార్‌ జంక్షన్‌ నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ఆటో డ్రైవర్స్‌తో భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం ఏనుగుల గడ్డలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్‌  స్వచ్ఛందంగా ఆటోల బంద్‌ పాటించాలన్నారు. కార్యక్రమంలో టాడు గ్రేటర్‌ అధ్యక్షుడు యాకుబ్, ప్రధాన కార్యదర్శి జిలుకర స్వామి, నాయకులు  వరికెల కిషన్, ఇసంపెల్లి సంజీవ, మేకల రవీందర్, కలకోట్ల జయరాం, దారా సూరి, మడికొండ బాబు, పసునూరి బాబు, చీకటి కుమార్, హరిచంద్రనాయక్, జన్ను బాబు, శంకర్, శ్రీనివాస్, శ్యాం, నర్సయ్య, బాల్‌ రాజ్, కాంతయ్య  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement