![Viral: Delhi Woman Slaps Kicks Pulls Hair of Officials Over Mask Issue - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/11/women.jpg.webp?itok=lMpeEAJf)
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి.. అంటే దాదాపు ఏడాదిన్నరగా మాస్కు ధరించడం, భౌతిక దూరం అనివ్యార్యమైపోయింది. వ్యాక్సిన్‌లు వచ్చినా మహమ్మారిని అడ్డుకునేందుకు కోవిడ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి అయ్యింది. కరోనా తగ్గినట్లే తగ్గి కొత్త కొత్త అవతారాల్లో పుట్టుకొస్తుంది. అందుకే మాస్క్ ధరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్న వారిపై ఇప్పటికీ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా కొందరిలో మార్పు రావడం లేదు. మొండి వైఖరి వీడకుండా తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అంతేగాక కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు.
తాజాగా మాస్క్ ధరించమని అడగిన అధికారులపై ఓ మహిళ రెచ్చిపోయింది. ఈ ఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. పీరాగారి మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చలాన్లు విధిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు మహిళలను ఆపి మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. మాస్క్ లేనందుకు జరిమానా కట్టాలని చలాన్ విధించారు. దీంతో మహిళలకు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
తరువాత ఇద్దరిలో ఓ మహిళా.. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి తెగబడింది. చెంపదెబ్బలు కొడుతూ, వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. అధికారుల జుట్టు పట్టుకొని వీరంగం సృష్టించింది. ఆమెను ఆపేందుకు అక్కడి వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment