బుధవారం హైదరాబాద్ పంజగుట్ట చౌరస్తాలో వైఎస్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, భట్టి, ఉత్తమ్, అంజన్‌కుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను బుధవారం గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నాయకులు కేవీపీ రామచంద్రరా వు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్ యాద వ్, వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి, గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఏపీలో మళ్లీ స్వర్ణయుగం: గట్టు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మళ్లీ వైఎస్సార్ నాటి స్వర్ణయుగం వచ్చిందని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ పంజగుట్ట చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, సంజీవరావు, వెంకటరమణ, చంద్రశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ పంజగుట్ట చౌరస్తాలో వైఎస్ విగ్రహం వద్ద కేక్ కట్ చేస్తున్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి
యాదాద్రి జిల్లాలో వైఎస్ విగ్రహావిష్కరణ
యాదగిరిగుట్ట: అభివృద్ధి ఎంత ముఖ్యమో.. సంక్షేమం కూడా అంతే ముఖ్య మని నమ్మిన ప్రజానాయకుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాంలో వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు పాండురాజు కమలాకర్, బత్తిని బాలరాజుగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment