సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ చౌరస్తా వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తక్షణమే అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపి బయటకు దిగేశాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్మం చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. కారు ఇంజిన్‌లో విద్యుత్ షాక్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఖైరతాబాద్ చౌరస్తా: కదులుతున్న కారులో మంటలు
Published Wed, Aug 4 2021 11:28 AM | Last Updated on Wed, Aug 4 2021 1:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment