జూబ్లీహిల్స్‌లో బీఎండబ్ల్యూ కారు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో బీఎండబ్ల్యూ కారు దగ్ధం

Jun 16 2024 10:54 AM | Updated on Jun 16 2024 11:25 AM

జూబ్లీహిల్స్‌లో బీఎండబ్ల్యూ కారు దగ్ధం

జూబ్లీహిల్స్‌లో బీఎండబ్ల్యూ కారు దగ్ధం

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నం.45లోని నందగిరి హిల్స్‌ చౌరస్తాలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ బీఎండబ్ల్యూ కారు అగ్నికి ఆహుతి అయింది. ఈ కారులో ఎవరున్నారు..? కారు ఎవరిది..? అనే వివరాలు తెలుసుకోడానికి జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. టీఎస్‌ 09 ఎఫ్‌ఎఫ్‌ 1880 నంబరు బీఎండబ్ల్యూ కారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం–45లోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ఫ్లైఓవర్‌ మీదుగా సినీ హీరో బాలకృష్ణ నివాసం వైపు నుంచి ఫిలింనగర్‌ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా కారులో పొగలు రావడంతో అందులో ఉన్న వ్యక్తి కిందకు దిగారు. 

క్షణాల్లోనే ఇంజన్‌లో నుంచి మంటలు రావడం, కారు మొత్తం మంటలు వ్యాపించడంతో కారు నడుపుతున్న వ్యక్తి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఘటన స్థలంలో వాహనదారులు ఫైర్‌ ఇంజన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌ ఇంజన్‌ అక్కడికి చేరుకునే లోగానే కారు పూర్తిగా దగ్ధమైంది. నడిరోడ్డుపై కారులో మంటలు వ్యాపించడంతో అసలే ట్రాఫిక్‌ రద్దీతో కిటకిటలాడే రహదారులన్నీ వాహనాలతో స్తంభించిపోయాయి. ఫలితంగా స్తంభించిన ట్రాఫిక్‌ను దాటుకొని ఫైర్‌ ఇంజన్‌ రావడం చాలా కష్టతరమైంది. 

ఎట్టకేటకు ఫైర్‌ ఇంజన్‌ ఘటన స్థలానికి చేరుకున్నా.. అప్పటికే కారు పూర్తిగా కాలిపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. ఈ కారు ఎవరిది, ఎవరు నడుపుతున్నారు.. ఎందుకు కాలిపోయింది.. అనే వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన స్థలాన్ని జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు పరిశీలించి, రెండు గంటలు శ్రమించి కొంతమేర ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకువచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement