ప్రతికాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నందిగిరి హిల్స్‌లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. కారు క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. దీంతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఫిల్మ్‌నగర్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది.
రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకునే క్రమంలో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులో మంటలు చెలరేగడంతో పాదచారులు భయంతో పరుగులు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment