హైదరాబాద్: మెట్రోరైలు నిర్మాణ పనుల దృష్ట్యా పంజాగుట్ట - ఖైరతాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పురుషోత్తమ్ నాయక్ సోమవారం వివరాలను వెల్లడించారు.
ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే కొన్ని బస్సులను రాజ్‌భవన్, యశోద హాస్పిటల్, సోమాజీగూడ క్రాస్‌రోడ్స్, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ మీదుగా అమీర్‌పేట వైపు మళ్లిస్తారు. మరికొన్ని బస్సులను ఖైరతాబాద్, ఆర్టీఏ కార్యాలయం, తాజ్‌బంజారా, జీవీకే మాల్, నిమ్స్ వెనుక గేట్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ మీదుగా అమీర్‌పేట వైపు మళ్లించనున్నట్టు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 25 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని.. ప్రయాణీకులు సహకరించాలని కోరారు.