గ్రేటర్‌లో రోజుకు 3వేల ట్రిప్పులు రద్దు
మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ రద్దీయే కారణం
హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి సనత్‌నగర్‌కు సిటీ బస్సుకు నిర్ణయించిన రన్నింగ్ టైమ్ 35 నిమిషాలు. కానీ ఇప్పుడు గంట దాటినా గమ్యానికి చేరుకోవడంలేదు. అన్ని చోట్లా అదే పరిస్థితి. కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, వేవ్‌రాక్, కొండాపూర్, బోరబండ, మాదాపూర్, లింగంపల్లి, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, మెహదీపట్నం, చార్మినార్, తదితర మార్గాల్లో నడిచే సిటీ బస్సులు ట్రాఫిక్ రద్దీ కారణంగా నత్తనడక నడుస్తున్నాయి. బస్సులకు కేటాయించిన రన్నింగ్ టైమ్ ట్రాఫిక్‌లోనే హరించుకు పోతోంది. దీంతో గ్రేటర్‌లోని 28 డిపోల పరిధిలో ప్రతి రోజు 3000కు పైగా ట్రిప్పులు రద్దవుతున్నాయి. 1.5 లక్షల మంది ప్రయాణ సదుపాయాన్ని కోల్పోతున్నారు. బేగంపేట్, జేబీఎస్, సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్డి, కోఠి, మలక్‌పేట్ తదితర మార్గాల్లో పలు ట్రిప్పుల బస్సులు రద్దు కానున్నాయి.