సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 1/3లోని పంజగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు చేసిన విస్తరణతో నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్కు జంక్షన్‌కు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది. గ్రేవియార్డ్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు తీరుతాయి.
ఇందుకోసం జీహెచ్‌ఎంసీ రూ.17 కోట్లు మంజూరు చేసింది. కేబుల్ బ్రిడ్జి, పాత గేటు నుంచి హెచ్‌టీ లైన్ వరకు రోడ్డును విస్తరించడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. ఈ బ్రిడ్జిని గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు.
చదవండి: హైదరాబాద్: చలో అంటే చల్తా నై!
Comments
Please login to add a commentAdd a comment