
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయడిన ఓ మహిళను చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రిలో చేర్పించాడు. వివరాల్లోకి వెళితే బీఎస్ మక్తాకు చెందిన వెంకటరమణ మూర్తి, సుధారాణి దంపతులు సోమవారం బైక్‌పై రాజీవ్ సర్కిల్ నుంచి బేగంపేట వైపు వెళుతుండగా ఓ ఆటో వీరి బైక్ దగ్గరగా వెళ్లడంతో బైక్ అదుపుతప్పి కిందపడడంతో వెంకటరమణ మూర్తికి స్వల్ప గాయాలు కాగా, సుధారాణి నడుము, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె నొప్పితో విలవిలలాడుతుండగా అక్కడే విధుల్లో ఉన్న పంజగుట్ట పెట్రోకార్ కానిస్టేబుల్ ఎన్.ప్రభు ఆమెను చేతులతో ఎత్తుకుని సమీపంలోని వివేకానంద ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. ఆమె అవస్థను చూడలేక ఎత్తుకుని తీసుకెళ్లినట్లు ప్రభు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment