సాక్షి,హైదరాబాద్: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ఇవాళ (సోమవారం) పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సాహెల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.
2023 డిసెబర్ 23న (శనివారం) హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రధాన నిందితుడు సాహిల్. శనివారం అర్ధరాత్రి దాటాక మితిమీరిన వేగంతో కారు నడిపిన సాహిల్ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టారు.
కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో ప్రజాభవన్ ఘటన అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు సాహిల్ తొలుత ముంబైకి, అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు గుర్తించారు.దీంతో అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. దుబాయి నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈ తరుణంలో ఈ ఏడాది డిసెంబర్ 4న కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ఎదుట సాహిల్ హాజరు కావాలని సూచించింది. దుబాయ్‌లో ఉన్న విచారణలో భాగంగా సాహిల్ దుబాయ్ నుండి హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో సాహిల్ ఇవాళ పంజాగుట్ట పోలీసుల విచారణను ఎదుర్కొనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment