డ్రంకన్ డ్రైవ్‌లో ఏడుగురి అరెస్ట్
Published Sat, Aug 27 2016 11:36 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
-వాహనాలు స్వాధీనం
పంజాగుట్ట: నగరంలోని పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. పంజాగుట్ట ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలు జరిగాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి శనివారం న్యాయస్థానంలో హాజరుపరుస్తామని సీఐ చెప్పారు.
Advertisement
Advertisement