
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్ట సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం ఓలా కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి ముఖ్యమంత్రి రాకపోకల కోసం ఏర్పాటు చేసిన గేటును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనలో క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులకు స్వల్పంగా గాయలయ్యాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ప్రమాదానికి గురైన కారును తొలగించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.