సాక్షి, సిటీబ్యూరో: పంజగుట్ట శ్మశానవాటిక వద్ద రోడ్డు విస్తరణ, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఇవి శనివారం నుంచి ఈ ఏడాది జూన్ 3 వరకు అమలులో ఉంటాయన్నారు. ఎస్‌ఎన్‌టీ జంక్షన్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్, పంజగుట్ట చౌరస్తాల వైపు ఏ భారీ వాహనాలను అనుమతించరు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్ జంక్షన్, రోడ్ నెం.45 జంక్షన్, రోడ్ నెం.36 వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్–యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్–మైత్రీవనం మీదుగా లేదా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్–రోడ్ నెం.45–బీవీబీ జంక్షన్– రోడ్ నెం.12 మీదుగా ప్రయాణించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment