పంజగుట్ట: గుట్టచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. సోమాజీగూడ రాజ్ భవన్ రోడ్‌లోని పార్క్ హోటల్‌లో హైటెక్ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పంజగుట్ట పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు యువతులు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళలను రిస్కీ హోమ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment