ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడులు చేసి ఇద్దరు సెక్స్ వర్కర్లతో పాటు నలుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలంగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మనోజ్ ప్రకాశ్ బాసి(40), రమేష్ పటేల్(24)లు కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఆనంద్ బంజారా కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి చెఫ్ ప్రశాంత్‌గౌడ(28), గురు(30), లోకేష్‌గౌడ(32), అభిషేక్(27)లతో పాటు ఇద్దరు ఆర్గనైజర్లను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సెక్స్ వర్కర్లిద్దరినీ పునరావాస కేంద్రానికి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment