సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో కొత్త కోణం వెలుగుచూసింది. వ్యాపారా లావాదేవీల్లో జరిగిన గొడవలే హత్యకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెలరోజులుగా రాంప్రసాద్‌కు విజయవాడకు చెందిన బిజినెస్ పార్టనర్ నుంచి బెదిరింపులు వస్తూ ఉండేవని, వాటా నిమిత్తం న్యాయంగా రావాల్సిన 50 కోట్లకు సంబంధించి అతగాడిపై కృష్ణలంక పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో రాంప్రసాద్‌ను చంపేశారని చెబుతున్నారు. నిన్న హైదరాబాద్ పంజాగుట్టలో రాంప్రసాద్‌ను ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి హత్యచేసి పారిపోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాంప్రసాద్ హత్య విజయవాడలోనూ కలకలం రేపుతోంది. ఆర్ధిక లావాదేవీలతోనే మాజీ వ్యాపార భాగస్వామి కోగంటి సత్యం...రాంప్రసాద్ హత్యకు స్కెచ్ వేసాడన్న కుటుంబసభ్యుల ఆరోపణపై పోలీసులు దృష్టి పెట్టారు. అయితే రాంప్రసాద్ హత్యకు కోగంటికి ఎలాంటి సంబంధం ఆయన అనుచరులు చెబుతునన్నారు. కాగా పటమటలోని కోగంటి సత్యం నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేశారు. అయితే కోగంటి సత్యం ప్రతి వారం పటమట పీఎస్‌లో సంతకం చేయాల్సి ఉందని, ఈ వారం రాకపోవడం వల్లే ఆయన కుటుంబసభ్యులను విచారించామని సీఐ దుర్గారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment