హైదరాబాద్‌కు పయనమైన ఎమ్మెల్యే రాజా | mla raja going to hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు పయనమైన ఎమ్మెల్యే రాజా

Published Sun, Dec 18 2016 11:19 PM | Last Updated on Mon, Oct 29 2018 8:21 PM

mla raja going to hyderabad

తొండంగి :
వైఎస్సార్‌ సీపీ అ«ధిష్టానం పిలుపు మేరకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదివారం రాత్రి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు సంబంధించి రాష్ట్రంలో పరిణామాలపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నెల 20న గవర్నర్‌ను కలవనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్నవరం రైల్వేస్టేçÙ¯ŒSకు వచ్చిన ఆయనను తుని, తొండంగి మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సమస్యలు వివరించారు. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, పార్టీ నాయకులు  పప్పల సీతారాముడు, సాపిశెట్టి చిన్న,  తొండంగి సొసైటీ ఉపాధ్యక్షుడు వనపర్తి సూర్యనాగేశ్వరరావు, బూర్తి కృష్ణ, కందాబాబ్జి, నాగం గంగ తదితరులు ఎమ్మెల్యే రాజాకు వీడ్కోలు పలికారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement