తుని బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్)
తుని: నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం జనం ఎదురు చూస్తున్నారు. ప్రజల నాడిని తెలుసుకున్న నాయకులు వైఎస్సార్ సీపీలో చేరడానికి సమాయత్తం అవుతున్నారు. టీడీపీ కోసం ఎన్నో త్యాగాలు చేసినా గుర్తింపు ఇవ్వలేదని, తమ భవిష్యత్తుకోసం జనాదరణ కలిగిన పార్టీలో చేరడమే సముచితమని వారు భావిస్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా జననేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న తుని గొల్ల అప్పారావు సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. ఇది చూసిన టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. టీడీపీలో నాయకులు బాగు పడ్డారే తప్ప అభివృద్ధి జరిగింది ఏమీ లేదన్న విషయాన్ని ప్రజలు గమనించారు.
వైస్సార్ సీపీలో చేరడానికి నాయకులు సిద్ధం: ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీకి చెందిన పలువురు మండల స్ధాయి నాయకులు వైఎస్సార్ సీపీలో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. దీంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. తుని, తొండంగి, కోటనందూరు మండలాలు, పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వీరందరూ బయటకు రావడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment