రోడ్‌షోలో మాట్లాడుతున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి పీవీ శ్యామ్‌సుందర్‌రావును గెలిపించి ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరిలో బైక్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. కేంద్రం ఇప్పటికే జిల్లాకు ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, పాస్‌పోర్టు కార్యాలయం, సైనిక పాఠశాల మంజూరు చేసిందని గుర్తు చేశారు.
సాక్షి, యాదాద్రి: బీజేపీ అభ్యర్థి పీవీ శ్యామ్‌సుందర్‌రావును గెలిపించి భువనగిరి కార్యకర్తలు ప్రధా ని మోదీకి బహుమతి ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శనివారం భువనగిరిలో బైక్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం భువనగిరి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. పీవీ శ్యామ్‌సుందర్‌రావు కొన్నేళ్లుగా నియోజకవర్గంలో ప్రజా సేవలో ఉన్నారన్నారు. ప్రతి కార్యకర్త తనకు తాను అభ్యర్థిగా భావించుకుని పీవీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సమయం మూడు రోజులే ఉన్నం దున కార్యకర్తలు పూర్తిస్థాయిలో పని చేస్తే కచ్చితంగా గెలుస్తామన్నారు. మోదీ ప్రధాని అయితే నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని గుర్తు చేశారు. ఇప్పటికే కేంద్రం ఏయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, పాస్‌పోర్టు కార్యాలయం, సైనిక పాఠశాల మంజూరు చేసిందన్నారు.
జాతీ య రహదారులను అభివృద్ధి చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ అభ్యర్థి పీవీ శ్యాంసుందర్‌రావు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గంలో ఇప్పటి రకు గెలిచిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రజల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. త మ స్వప్రయోజనాల కోసం ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. బీజేపీ మో దీ ప్రభుత్వం నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు మం జూరు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెదిరె శ్రీరాంరెడ్డి, దాసరి మల్లేశం, నర్ల నర్సింగ్‌రావు, సుర్వి లావణ్య, చందా మహేందర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment