సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదు అయిన పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డు విచారణ చేపట్టింది. పీడీ యాక్ట్ బోర్డ్ చైర్మన్ జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో విచారణ సాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ జరిగిన విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే రాజాసింగ్.
ఇదిలా ఉంటే.. ముహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే.. ‘నేను మహ్మద్ ప్రవక్త గురించి వీడియోలో మాట్లాడానని కొందరు ఆరోపిస్తున్నారు. నేను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదు’ అంటూ మరో వీడియోను అరెస్ట్‌కు ముందు రిలీజ్ చేశారు రాజాసింగ్. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు.
మరోవైపు.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో రాజాసింగ్ క్రిమినల్ కేసులు పొందుపరచలేదంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి.. నవంబర్ 1 లోగా సమాధానం ఇవ్వాలని రాజాసింగ్ తరపు న్యాయవాదుల్ని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment