
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే మరోసారి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంగళ్‌హాట్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద మళ్లీ నోటీసులు అందజేశారు. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరారు.
వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది ఆగస్టులో కేసు నమోదైంది. కాగా, అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద తాజాగా రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసుల నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment