mangalhat police station
-
రాజాసింగ్‌కు మళ్లీ నోటీసులు.. భయపడేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. తాజాగా మంగళ్‌హాట్ పోలీసులు.. రాజాసింగ్‌కు నోటీసులు అందజేశారు. కాగా, నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్ షరతులను ఉల్లంఘించారని తెలిపారు. అంతకుముందు, పీడీ యాక్ట్ కేసులో రాజాసింగ్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక, పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా భయపడేది లేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను.. గో హత్య, మతమార్పిడులు, లవ్ జిహాద్‌పై చట్టం చేయాలని కోరాను.. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయి. ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే.. నాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మరోసారి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే మరోసారి రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంగళ్‌హాట్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద మళ్లీ నోటీసులు అందజేశారు. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది ఆగస్టులో కేసు నమోదైంది. కాగా, అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద తాజాగా రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసుల నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు అయ్యింది. ఈ నెల 6వ తేదీన రాజాసింగ్.. అయోధ్యపై ఓ పోస్ట్ చేశారు. రాజాసింగ్ పోస్ట్‌పై మంగళహాట్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదాస్ప వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ నోటీసు ఇచ్చారు పోలీసులు. హైకోర్టు విధించిన షరతులు ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. అయితే.. సదరు చర్యపై ఆయన తరపు న్యాయవాది ఇచ్చిన సమాధానం సంతృప్తిగా లేదని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో.. ఐపీసీ 295-ఏ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనపై కేసు నమోదు అయ్యి.. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ కావడంతో జైలుకు వెళ్లారు. ఆ బెయిల్‌పై వచ్చిన ఆయన మరోసారి ఇలా కేసును ఎదుర్కొంటున్నారు . ఆయనపై మంగళహాట్ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. -
ఏడుగురి స్నేహితుల మధ్య ‘లూడో గేమ్’ వివాదం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్ విషయంలో స్నేహితుల మధ్య వివాదం ఏర్పడింది. ఆ వివాదం కాస్త తీవ్ర దాడికి దారి తీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునేంత స్థాయికి చేరింది. ఒకరి ప్రాణం మీదకు వచ్చింది. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుత వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చదవండి: మంత్రుల ముందు ‘ఈటల’ గడియారాలు ధ్వంసం పోలీసుల వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. గంగాబౌలి ప్రాంతానికి చెందిన మోహమ్మద్ అనీఫ్ (25), టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన రషీద్ (30), మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముస్తఫా (24)తో పాటు అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులతో లూడో గేమ్ గెలుపోటములపై వివాదం ఏర్పడింది. ఈ సమయంలో ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అప్పటికే వారందరూ మద్యంమత్తులో ఉన్నారు. ఒకరినొకరు దాడి చేసుకొని పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. కొద్దిసేపటి తరువాత బయటికి వెళ్లివచ్చిన యువకులు మహమ్మద్ అనీఫ్పై తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో హనీఫ్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మహమ్మద్ ముస్తఫా (24), రషీద్ (30)లకు కత్తిపోట్లకు గురయ్యారు. అక్కడినుంచి బయటకు తప్పించుకుని పారిపోయారు. దీంతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భయాందోళనతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని హనీఫ్, మరో ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ముస్తఫా, రషీద్ కోలుకుంటున్నారని మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ రణీశ్వర్రెడ్డి తెలిపారు. పారిపోయిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హనీఫ్, హాజీ స్నేహితులు. వీరిద్దరూ లూడో గేమ్ ఆడుతుంటారు. అయితే డబ్బులు పెట్టి ఆడుతున్నారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య డబ్బు విషయమై గొడవ ఏర్పడింది. పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే తీవ్ర గాయాలపాలైన హనీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హాజీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక -
నేను ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్‌నా?
-
నేను ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్‌నా?
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. మంగళ్‌హాట్ పోలీసుల రౌడీషీటర్స్ జాబితాలో రాజాసింగ్ పేరును చేర్చారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కొందరు బీజేపీ కార్యకర్తలు దీన్ని గమనించి రాజాసింగ్‌కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ.. ఇంకా తన పేరు రౌడీషీటర్ జాబితాలో ఉండటంపై మండిపడ్డారు. తాను అన్ని వదిలేసి.. ప్రజా సేవలోకి వచ్చానని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మంత్రులపై గతంలో రౌడీషీట్లు ఉన్నాయని.. వాటిని ఇప్పుడు కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. తనపై రౌడీషీట్ పెట్టినందుకు బాధలేదని చెప్పారు. తాను ఇప్పుడు ఎమ్మెల్యేనా, రౌడీషీటర్‌నా అనే దానికి ముఖ్యమంత్రి, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్ మంగళ్‌హాట్ పీఎస్‌లో లాకప్‌డెత్
హైదరాబాద్: నగరంలోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో లాకప్‌డెత్ జరిగింది. పోలీసులు విచారణ నిమిత్తం భీంసింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. శనివారం అతను పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసులే భీంసింగ్‌ను కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు భీంసింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ రాంభూపాల్ రావు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని విచారిస్తున్నారు.