
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు అయ్యింది. ఈ నెల 6వ తేదీన రాజాసింగ్.. అయోధ్యపై ఓ పోస్ట్ చేశారు. రాజాసింగ్ పోస్ట్‌పై మంగళహాట్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివాదాస్ప వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ నోటీసు ఇచ్చారు పోలీసులు. హైకోర్టు విధించిన షరతులు ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. అయితే.. సదరు చర్యపై ఆయన తరపు న్యాయవాది ఇచ్చిన సమాధానం సంతృప్తిగా లేదని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో.. ఐపీసీ 295-ఏ కింద కేసు నమోదు చేశారు.
ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనపై కేసు నమోదు అయ్యి.. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ కావడంతో జైలుకు వెళ్లారు. ఆ బెయిల్‌పై వచ్చిన ఆయన మరోసారి ఇలా కేసును ఎదుర్కొంటున్నారు . ఆయనపై మంగళహాట్ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment