రౌడీషీటర్లపై నిఘా పెంచండి
Published Thu, Nov 28 2013 2:05 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు, న్యూస్‌లైన్ :నేరచరిత్ర ఉన్నవారిపై రౌడీషీట్లు ప్రారంభించడంతోపాటు రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గుంటూరు నగరంలోని అరండల్‌పేట పోలీసుస్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల ఫైల్‌ను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో 50మంది రౌడీషీటర్లు ఉండగా తరచూ వివిధ కేసుల్లో చిక్కుకునేవారి వివరాలు అడిగారు. రౌడీషీటర్ల కదిలికలపై ఎప్పటికప్పుడు ఠాణాలకు సమాచారం ఉండాలని ఆదేశించారు.
నేర చరిత్ర ఉంటే వారిపై వెంటనే రౌడీషీట్లు ప్రారంభించాలన్నారు. పలు కేసుల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిశీలించడంతోపాటు దొంగతనాలు, హత్య లు, మహిళలలపై వేధింపులకు సంబంధించి న ఫైళ్లను వేరువేరుగా పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ తీరుపై ఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్‌ను ఆవరణాన్ని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఐజీ వెంట అర్బన్ జిల్లా ఎస్పీ జెట్టి గోపినాథ్, ఇన్‌చార్జీ డీఎస్పీ సుబ్బారెడ్డి, సీఐ ఆళహరి శ్రీనివాస్ ఉన్నారు.
Advertisement