హనీప్రీత్ కోసం కొనసాగుతున్న వేట
హనీప్రీత్ కోసం కొనసాగుతున్న వేట
Published Sun, Sep 17 2017 6:47 PM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM
సాక్షి,చండీగర్: అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్‌ను దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో పంచ్‌కులలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి తాజాగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డేరా చీఫ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, డేరా ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. వీరిద్దరూ విదేశాలకు పారిపోకుండా వీరిపై లుక్‌అవుట్ నోటీస్ జారీ అయిన విషయం విదితమే. డేరాలో చురుకుగా వ్యవహరించే ప్రదీప్ గోయల్ ఇన్సాన్‌ను ఆదివారం రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హర్యానా పోలీసులతో కూడిన సిట్ అదుపులోకి తీసుకుంది.
ఇక ఆదిత్య ఇన్సాన్ బావ ప్రకాష్ అలియాస్ విక్కీని మొహాలీలో అరెస్ట్ చేసినట్టు పంచ్‌కుల డీసీపీ మన్బీర్ సింగ్ తెలిపారు. ఇక శనివారం అరెస్ట్ అయిన వ్యక్తిని విజయ్‌గా గుర్తించినట్టు వెల్లడించారు. డేరా బాబాను దోషిగా నిర్ధారించిన అనంతరం హర్యానా, పంజాబ్‌లలో జరిగిన హింసాకాండలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నామని చెప్పారు.
Advertisement