'గుర్మీత్‌తో నా భార్యకు శారీరక సంబంధం' | Ram Rahim had an illicit relationship with adopted daughter Honeypreet, claims her ex-husband | Sakshi
Sakshi News home page

'గుర్మీత్‌తో నా భార్యకు శారీరక సంబంధం'

Published Tue, Aug 29 2017 10:17 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

'గుర్మీత్‌తో నా భార్యకు శారీరక సంబంధం'

'గుర్మీత్‌తో నా భార్యకు శారీరక సంబంధం'

సాక్షి, రోహ్‌తక్‌: డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌కు దత్త పుత్రిక హనీప్రీత్‌ సింగ్‌ ఇశాన్‌ల సంబంధంపై ఆమె భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య హనీప్రీత్‌, బాబా గుర్మీత్‌ల మధ్య శారీరక సంబంధం ఉందని విశ్వాస్‌ గుప్తా అన్నారు. హనీప్రీత్‌ అసలు పేరు ప్రియాంక తనేజా. 1999లో విశ్వాస్‌ గుప్తా, హనీప్రీత్‌లకు వివాహం జరిగింది.

2011లో హనీప్రీత్‌ నుంచి విడాకులు కోరుతూ గుప్తా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గుర్మీత్‌, హనీప్రీత్‌లు శృంగారంలో పాల్గొంటూ తనకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో గుప్తా విస్తుగొలిపే విషయాలను వెల్లడించారు. బాబా నివాసమైన గుఫాలో తాను ఉండేవాడినని చెప్పారు. బాబా, హనీలు శృంగారంలో పాల్గొంటుండగా తాను చూశానని తెలిపారు. ఇది గమనించిన బాబా విషయం బయటకు చెబితే తనను చంపేస్తానని బెదిరించారని వెల్లడించారు.

ఎక్కడికి వెళ్లినా హనీని బాబా తన వెంట తీసుకెళ్లేవారని, తమ జంటను(గుప్తా-హనీప్రీత్‌) ఏకాంతంగా ఏ రోజు వదల్లేదని చెప్పారు. గుప్తా వ్యాఖ్యలపై దుమారం రేగడంతో స్పందించిన డేరా సచ్చా సౌదా అనుచరులు అవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టి పారేశారు. బాబా ఒత్తిడి కారణంగా కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని విశ్వాస్‌ తెలిపారు. గుప్తాకు డేరా సచ్చా సౌదా అనుచరుల నుంచి అపాయం ఉండటంతో ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement