Vishwas Gupta
-
శబరిమల ఆలయం: వాటికి అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహ్తా గురువారం లేఖ రాశారు. శబరిమల ఆలయంలో నెయ్యి అభిషేకం, పంపానదిలో స్నానాలకు అనుమతి లేదని లేఖలో ఆయన వెల్లడించారు. వర్చువల్ క్యూపోర్టల్ ద్వారా దర్శనం కోసం భక్తుల నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. https://sabarimalaonline.org లో భక్తులు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలుత రోజుకు వెయ్యి, వారాంతంలో రోజుకు రెండు వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తామన్నారు. దర్శనానికి 48 గంటల ముందు కరోనా వైరస్ నిర్థారణ పరీక్ష తప్పనిసరి అని స్పష్టం చేశారు. పదేళ్ల లోపు, 60 ఏళ్లకు పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని ఆయన తెలిపారు. చదవండి : హైదరాబాద్ సీపీ ఇంట్లోకి వరదనీరు -
హనీప్రీత్ కుట్ర: నన్ను చంపేస్తారు!
-
హనీప్రీత్ కుట్ర: నన్ను చంపేస్తారు!
సాక్షి, కర్నాల్: డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనీప్రీత్, గుర్మీత్‌లకు శారీరక సంబంధం ఉందంటూ ఇటీవల పేర్కొన్న విశ్వాస్.. తాజాగా తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ మేరకు తన ప్రాణాలు రక్షించాలని కోరుతూ గురువారం కర్నాల్ పోలీసులను ఆశ్రయించారు. గుప్తా ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ ఎస్హెచ్ఓ రాజ్బీర్ సింగ్ తెలిపారు. ఓవైపు గుర్మీత్‌కు జైలుశిక్ష నేపథ్యంలో పరారైన హనీప్రీత్ కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతుండగా మరోవైపు విశ్వాస్ గుప్తా తన మాజీ భార్య హనీప్రీత్ వ్యవహారాలను వెలుగులోకి తెస్తున్నారు. హనీప్రీత్, డేరా సచ్ఛా సౌదాల విషయాలు మరిన్ని వెల్లడిస్తానని భావించి కొందరు తనకు ఫోన్‌చేసి చంపేస్తామని హెచ్చరిస్తున్నట్లు విశ్వాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వివాహం అనంతరం హనీప్రీత్‌ను గుర్మీత్ తన వద్దకు పంపలేదని, వారిద్దరే ఏకాంతంగా గడిపేవారని చెప్పడం కూడా తనపై హత్యకుట్రకు ఓ కారణమై ఉంటుందన్నారు. చంఢీగఢ్‌లో డేరా చీఫ్ గుర్మీత్, హనీప్రీత్‌లకు వ్యతిరేకంగా ఎన్నో విషయాలు వెల్లడించినప్పటినుంచీ గుర్తుతెలియని వ్యక్తులు తనను వెంబడిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హనీప్రీత్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన వివరించారు. కాగా, గత ఆగస్టు 25న అత్యాచారాల కేసులో గుర్మీత్‌కు పంచకుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన తర్వాత హనీప్రీత్ పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు పంజాబ్, హరియానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హనీప్రీత్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు గత మంగళవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
బాంబు పేల్చిన హనీప్రీత్ మాజీ భర్త
సిర్సా: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌పై హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డేరా బాబాకు హనీప్రీత్ దత్తపుత్రిక కాదని, చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదని వెల్లడించారు. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. 'తన డేరాలో గుర్మీత్ బిస్బాస్లా వ్యవహరించేవారు. ఆరు జంటలు(కుటుంబ సభ్యులు) 28 రోజుల పాటు డేరాలో ఉన్నాం. రాత్రిళ్లు హనీప్రీత్... గుర్మీత్ గదిలోనే ఉండేది. నన్ను మాత్రం గది బయట పడుకోమనేవార'ని గుప్తా తెలిపారు. గుర్మీత్‌తో ఏకాంతంగా గడుపుతుండగా హానీప్రీత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని తనను బెదిరించారని వెల్లడించారు. తన భార్యతో గుర్మీత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని 2011లో గుప్తా కోర్టుకు వెళ్లారు. ఆయుధాలతో కూడిన పెద్ద పెట్టెను గుర్మీత్ ఎల్లప్పుడు తన వెంట ఉంచుకునేవారని, అనుచరులు ఈ పెట్టెను అతడు ప్రయాణించే కారులో పెట్టేవారని గుప్తా వివరించారు. కాగా, గుర్మీత్, హనీప్రీత్ ఎప్పుడూ కలిసే ఉండేవారని.. డేరాలో ఉన్నప్పుడే కాదు, బయటకు వెళ్లినప్పుడు కూడా ఒకే రూములో ఏకాంతంగా గడిపేవారని ఇంతకుముందు ఓ సాధ్వి చెప్పారు. మరోవైపు హనీప్రీత్ కోసం హరియాణా పోలీసులు గాలిస్తున్నారు. ఆమె నేపాల్‌లో ఉన్నట్టు వచ్చిన వార్తలను అధికారులు తోసిపుచ్చారు. హనీప్రీత్ తమ దేశంలో లేదని నేపాల్ సీబీఐ కూడా స్పష్టం చేసింది. -
'గుర్మీత్‌తో నా భార్యకు శారీరక సంబంధం'
సాక్షి, రోహ్తక్: డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ ఇశాన్‌ల సంబంధంపై ఆమె భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య హనీప్రీత్, బాబా గుర్మీత్‌ల మధ్య శారీరక సంబంధం ఉందని విశ్వాస్ గుప్తా అన్నారు. హనీప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా. 1999లో విశ్వాస్ గుప్తా, హనీప్రీత్‌లకు వివాహం జరిగింది. 2011లో హనీప్రీత్ నుంచి విడాకులు కోరుతూ గుప్తా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుర్మీత్, హనీప్రీత్‌లు శృంగారంలో పాల్గొంటూ తనకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారని విడాకుల పిటిషన్లో పేర్కొన్నారు. ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో గుప్తా విస్తుగొలిపే విషయాలను వెల్లడించారు. బాబా నివాసమైన గుఫాలో తాను ఉండేవాడినని చెప్పారు. బాబా, హనీలు శృంగారంలో పాల్గొంటుండగా తాను చూశానని తెలిపారు. ఇది గమనించిన బాబా విషయం బయటకు చెబితే తనను చంపేస్తానని బెదిరించారని వెల్లడించారు. ఎక్కడికి వెళ్లినా హనీని బాబా తన వెంట తీసుకెళ్లేవారని, తమ జంటను(గుప్తా-హనీప్రీత్) ఏకాంతంగా ఏ రోజు వదల్లేదని చెప్పారు. గుప్తా వ్యాఖ్యలపై దుమారం రేగడంతో స్పందించిన డేరా సచ్చా సౌదా అనుచరులు అవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టి పారేశారు. బాబా ఒత్తిడి కారణంగా కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని విశ్వాస్ తెలిపారు. గుప్తాకు డేరా సచ్చా సౌదా అనుచరుల నుంచి అపాయం ఉండటంతో ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఉంటున్నారు.