
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహ్తా గురువారం లేఖ రాశారు. శబరిమల ఆలయంలో నెయ్యి అభిషేకం, పంపానదిలో స్నానాలకు అనుమతి లేదని లేఖలో ఆయన వెల్లడించారు. వర్చువల్ క్యూపోర్టల్ ద్వారా దర్శనం కోసం భక్తుల నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. https://sabarimalaonline.org లో భక్తులు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలుత రోజుకు వెయ్యి, వారాంతంలో రోజుకు రెండు వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తామన్నారు. దర్శనానికి 48 గంటల ముందు కరోనా వైరస్ నిర్థారణ పరీక్ష తప్పనిసరి అని స్పష్టం చేశారు. పదేళ్ల లోపు, 60 ఏళ్లకు పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని ఆయన తెలిపారు.
చదవండి : హైదరాబాద్ సీపీ ఇంట్లోకి వరదనీరు
Comments
Please login to add a commentAdd a comment