సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. కమర్షియల్ ట్యాక్స్‌లో కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో భారీ కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.1000 కోట్ల అవకతవకలు జరిగినట్టు అధికారులు తెలిపారు. కాగా, 75 కంపెనీలు ఈ కుంభకోణానికి పాల్పడ్డినట్టు చెప్పారు. ఇక, ఈ స్కాంలో లబ్ధి పొందిన జాబితాలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉంది. అయితే, ఈ మొత్తం వ్యవహారం ఫోరెన్సిక్ అడిట్‌తో వెలుగు వచ్చింది.
ఇక, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతో ట్యాక్స్ పేమెంట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు ఐఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, పిలాంటో టెక్నాలజీస్‌లపై కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో, స్కామ్‌కు పాల్పడిన నిందితులపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment