వాణిజ్య పన్నుల శాఖకు 75 సంస్థల భారీ టోకరా
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరు చెప్పి పన్ను ఎగవేత
ఫోరెన్సిక్ ఆడిట్, అంతర్గత విచారణలో తాజాగా గుట్టురట్టు
11 సంస్థలు ఎగ్గొట్టిన పన్నుల విలువే సుమారు రూ. 400 కోట్లు
అక్రమంగా లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉన్న వైనం
సీసీఎస్‌లో కేసు నమోదు.. నిందితుల్లో మాజీ సీఎస్ సోమేశ్ సహా మరికొందరు
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్‌ల చెల్లింపు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు బయటపడింది. వివిధ సంస్థలు దాదాపు రూ. 1,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను ఎగవేసినట్లు నిగ్గుతేలింది. ఆయా సంస్థల అక్రమాలకు కొందరు ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులే సహకరించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.
అక్రమంగా లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సైతం నిలవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు.
సోమేశ్ మౌఖిక ఆదేశాలతో..
వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. స్రూ్కటినీ మాడ్యూల్‌లో పనిచేస్తూ వివిధ సంస్థలు దాఖలు చేసే ట్యాక్స్ రిటర్న్‌లలో లోపాలను గుర్తించి వాణిజ్య పన్నుల శాఖను అప్రమత్తం చేస్తోంది. ఈ సంస్థ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశాన్నీ పర్యవేక్షించాలి. కానీ సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు స్రూటినీ మాడ్యూల్‌లో మార్పుచేర్పులు చేశారు.
ఈ కార్యకలాపాల కోసం సోమేశ్ కుమార్, శోభన్‌బాబులతోపాటు వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్ ఎస్‌వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరాంప్రసాద్ తదితరులతో వాట్సాప్‌లో ‘స్పెషల్ ఇనీíÙయేటివ్స్’ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. దీని ద్వారానే సోమేశ్ అటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు, ఇటు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్‌కు మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తూ పోయారు. ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా (రెవెన్యూ) ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యవహారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసినప్పుడూ కొనసాగింది.
వాట్సాప్ గ్రూప్ ద్వారా శోభన్ బాబుకు ఆదేశాలు ఇచి్చన సోమేశ్ తాము చెప్పిన సంస్థలకు సంబంధించిన రిటర్న్‌లలో ఐజీఎస్టీ, సెస్‌లో ఉన్న లోపాలు బయటపడకుండా చేయాలని స్పష్టం చేశారు. స్రూ్కటినీ మాడ్యూల్‌లో మార్పులు చేసిన శోభన్‌బాబు కొన్ని సంస్థలు చేసిన స్కామ్‌లు బయటపడకుండా చేశారు. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా అనేక సంస్థలు రూ.1000 కోట్ల వరకు స్కామ్‌కు పాల్పడ్డా బయటపెట్టలేదు.
ఎట్టకేలకు బట్టబయలు..
ఇటీవల బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశంలో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సంస్థ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో రూ. 25.51 కోట్లు స్వాహా చేసినట్లు తేల్చారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ.. సెంటర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ–డాక్) సహకారం కోరింది. డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన సీ–డాక్... జరిగిన గోల్‌మాల్‌ను గుర్తించింది.
దీని ఆధారంగా అధికారులు సైతం అంతర్గత విచారణ చేపట్టారు. ఐఐటీ–హైదరాబాద్ సహా వివిధ సంస్థల నుంచి వివరాలు కోరారు. సోమేశ్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అభ్యర్థన మేరకే తాము స్రూ్కటినీ మాడ్యూ ల్‌లో మార్పులు చేశామన్న ఐఐటీ–హైదరా బాద్.. ఆ మేరకు వివరాలను సమరి్పంచింది.
బయటి సిబ్బందితోనే ఐఐటీ–హైదరాబాద్ పర్యవేక్షణ
సీ–డాక్ నివేదిక ప్రకారం దాదాపు 75 సంస్థలకు సంబం«ధించిన రిటర్న్‌లు పూర్తిస్థాయిలో స్క్రూటినీ కాకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు జరిగినట్లు వెలుగులోకి వచి్చంది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌లో మార్పులు చేసేందుకు వాడిన ఐపీ అడ్రస్‌లలో ఒకటి ఏపీలోని హిందూపూర్ నుంచి పనిచేసిందని, ఈ డేటాను యాక్సెస్ చేసిన వ్యక్తులు.. వారి పాస్‌వర్డ్‌గా పిలాంటో అనే పేరును వినియోగించినట్లు కూడా సీ–డాక్ బయటపెట్టింది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌ను నిర్వహించే బాధ్యతలు చేపట్టిన ఐఐటీ–హైదరాబాద్ దీనికోసం కనీసం ఒక్క ఉద్యోగిని కూడా నియమించుకోలేదని బయటపడింది.
సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ–హైదరాబాద్ చిరునామాతోనే రిజిస్టరై ఉన్న పిలాంటో టెక్నాలజీస్‌లో పనిచేసే వారినే ఈ పని కోసం వినియోగించుకుంది. సీ–డాక్ నివేదికతోపాటు అంతర్గత విచారణ నేపథ్యంలో కేవలం 11 సంస్థలు చేసిన స్కామ్ విలువే రూ. 400 కోట్ల వరకు ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తేల్చారు. మొత్తమ్మీద దాదాపు 75 సంస్థలు రూ. 1,000 కో ట్ల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధి కారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సోమేశ్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్‌వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, పి లాంటో టెక్నాలజీస్ తదితరులను నిందితులుగా చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment